మహేష్ సినిమా సెట్‌లో సీఎం సర్‌ప్రైజ్ ఎంట్రీ

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌ కోసం డెహ్రాడూన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ పక్కన పూజా హెగ్డే ఆడిపాడనుంది. ఈ సినిమాలో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించబోతున్న విషయం తెలిసిందే.

సోమవారం (జూన్ 18) నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు మ‌హేష్ ఆదివారం అక్కడికి చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మొద‌లైంది.

అయితే ఈ సినిమా సెట్‌కు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ వచ్చి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచారు. ఆయన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ను కలిసి, కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మ‌హేష్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లితోనూ మాట్లాడిన సీఎం రావత్ మర్యాదపూర్వకంగా కలిసాను అని..డెహ్రాడూన్‌లో ఉన్నంతకాలం వారికి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. తొలుత డెహ్రాడూన్‌లో కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలోని అధిక భాగం యూఎస్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నటుడు అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఆదివారం నరేష్‌ తన ఇంస్టగ్రాం ఖాతాలో డెహ్రాడూన్‌ విమానాశ్రయం ఫొటోను షేర్‌ చేశారు.

దీన్ని బట్టి ఆయన కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత మ‌హేష్ బాబు సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సినిమాను నిర్మించనుంది.

మహేష్ కెరీర్లో 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కొత్త సినిమా కోసం స్టూడెంట్‌గా మారిపోయి డెహ్రాడూన్‌ వెళ్ళిన మహేష్ ని అక్కడ సీఎం కలవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ధి సోషల్ మీడియా గా మారింది.

Share

Leave a Comment