అలా వచ్చాడో లేదో వెంటనే వైరల్

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నేటికీ ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సినిమాలో దేవిశ్రీ బాణీలు ప్రేక్షకలోకాన్ని కట్టిపడేశాయి.

ముఖ్యంగా చిత్రంలోని ‘‘వచ్చాడయ్యో సామి..’’ పాట మాత్రం థియేటర్లను మారుమోగించేసింది. ఆ పాట వస్తుంటే జనం ఈలలతో థియేటర్లను హోరెత్తించేశారు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, దేవిశ్రీ సంగీతం ప్రాణం పోశాయి. పాటకు తగ్గట్టుగా పంచకట్టులో మహేష్ స్టెప్స్ అదరగొట్టేశాయి.

అయితే తాజాగా ఎంతో స్పెషల్‌గా ఈ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. దానితో పాటు 360 డిగ్రీ వీడియో మేకింగ్ ని కూడా విడుదల చేసారు. 360 డిగ్రీల కోణంలో ఈ పాటను చూడగలగటం ఇందులోని ప్రత్యేకత.

ఈ సాంగ్‌ లో మ‌హేష్ పంచెక‌ట్టులో కనిపించి ప్రేక్ష‌కుల‌కి క‌నువిందు చేశాడు. దీంతో ఈ పాట అలా విడుదలైందో లేదో.. వెంటనే వైరల్ అయిపోయింది. అసలే సూపర్ హిట్ సాంగ్.. పైగా 360 డిగ్రీల్లో చూసే అవకాశం ఉండటంతో ఈ పాట చూసి ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు.

లుంగీ, తలకి పాగా చుట్టుకుని నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేష్ బాబు కనిపిస్తూ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఈ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడటం విశేషం.

ఇక చిత్రంలో ముఖ్యమంత్రిగా మహేష్, ఆయన సరసన కైరా అద్వానీ ఆధ్బుతమైన నటన కనబర్చడంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ‘భరత్ అనే నేను’ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

భరత్ అనే నేను భారీ హిట్ అవడంతో సూపర్ స్టార్ మహెష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఒక నెల నుండి ఫ్యామిలీతో వేసవి సెలవల్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలోనే వంశీ పైడిపల్లితో తన 25 వ చిత్ర షూటింగ్ తో సెట్స్ మీదకి వెళ్లబోతున్నాడు. నిర్మాతలు దిల్‌ రాజు, అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Share

Leave a Comment