కీబోర్డు కుర్రాడు అదరగొట్టాడు

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నేటికీ ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సినిమాలో దేవిశ్రీ బాణీలు ప్రేక్షకలోకాన్ని కట్టిపడేశాయి.

ముఖ్యంగా చిత్రంలోని ‘‘వచ్చాడయ్యో సామి’’ పాట మాత్రం థియేటర్లను మారుమోగించేసింది. ఆ పాట వస్తుంటే జనం ఈలలతో థియేటర్లను హోరెత్తించేశారు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, దేవిశ్రీ సంగీతం ప్రాణం పోశాయి. పాటకు తగ్గట్టుగా పంచకట్టులో మహేష్ స్టెప్స్ అదరగొట్టేశాయి.

ఇపుడు ఒక అబ్బాయి ఈ పాట ఇన్స్‌ట్రుమెంటల్ ని చక్కని రిథంతో సేమ్ టు సేమ్ గా కీబోర్డు మీద వాయించి అందరి మన్ననలను అందుకుంటున్నాడు. వైజాగ్ కి చెందిన ఈ అబ్బాయి టాలెంట్ చూసి నెటిజన్స్ అందరూ పొగడ్తల తో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో కి నాలుగు వేల రెండు వందలకి పైగా లైక్‌లు, లక్షా పాతిక వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

ఈ మధ్య కాలం లో వచ్చిన పాటల్లో ధి బెస్ట్ సాంగ్ ఇదే. అలాంటి పాట కి ఈ అబ్బాయి కవర్ వర్షన్ చేసి కేవలం కీబోర్డు మీద దానిని ఉన్నది ఉన్నట్టు పలికించిన విధానం ప్రశంసనీయం. రేడియోలలో ఇప్పటికీ ప్రతి రోజు ఒక్కసారైన ప్లే చేస్టుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహేష్ అభిమానులకు ఈ పాట పండగలాంటిందే.

ప్రస్తుతం ఈ వీడియో ని అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. కామెంట్ల వర్షం తో ఈ అబ్బాయిని అభినందిస్తు తను ఫ్యూచర్ లో అధ్బుతమైన మ్యుసీషియన్ అవుతాడని ఖితాబు ఇస్తున్నారు. ఈ కాలం పిల్లలు ఎంత ప్రతిభావంతులో చెప్పడానికి ఇదొక ఉదాహరణ గా పరిగనించవచ్చు.

ఈ సాంగ్‌ లో మ‌హేష్ పంచెక‌ట్టులో కనిపించి ప్రేక్ష‌కుల‌కి క‌నువిందు చేశారు. తలకి పాగా చుట్టుకుని నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేష్ బాబు కనిపిస్తూ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఈ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడటం విశేషం.

ప్రస్తుతం డెహ్రూడూన్ లో వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ఈమధ్యనే అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Share

Leave a Comment