మల్టీస్టారర్ గురించి ఏమన్నాడంటే

అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు వంటి వారు మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. ఆ తర్వాత వచ్చిన హీరోలు మాత్రం మల్టీస్టారర్ సినిమాలకి దాదాపు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఈ ట్రెండ్ ని సెట్ చేసిన ఘనత సూపర్‌స్టార్ మహేష్ కే దక్కుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో మళ్ళీ తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు మొదలయ్యాయి.

ఇప్పుడు మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ సినిమాలో చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని హీరోలందరూ అంటున్నారు. తాజాగా వరుణ్ తేజ్ కూడా ఈ మాట అన్నాడు. కొన్ని రోజుల క్రితం తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో ముచ్చటించాడు వరుణ్ తేజ్.

ఓ అభిమాని.. సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఆయనతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తారా? అనడిగాడు. అందుకు వరుణ్ తేజ్ – “మహేష్ సార్ నటించిన చిత్రాల్లో ‘అతడు’ నా ఫేవరెట్ మూవీ. డెఫినెట్ గా ఆయనతో కలిసి నటిస్తా” అని వరుణ్ చెప్పాడు.

ఇంకొక అభిమాని తిరిగి అదే ప్రశ్న అడగ్గా ” మహేష్ బాబు గారు చాలా మంచి యాక్టర్. ఆయన తెలుగు ఇండస్ట్రీ లో పేద్ద స్టార్స్ లో ముందు వరుస లో ఉంటారు. ఆయన తో కలిసి వర్క్ చేయడానికి నేనెప్పుడూ రేడీ నే.. మంచి కథ ఉంటే ఎవరితో అయినా కలిసి చేస్తాను” అని తెలిపాడు.

ఇంతక ముందు కూడా ఒకసారి వరుణ్ తేజ్ అమెరికా లో ఒక ఫంక్షన్ లో భాగంగా ‘అతడు’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ చెప్పి అమెరికాలోని అభిమానులను సంతోష పెట్టాడు. తన ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా వరుణ్ తేజ్ మహేష్ డైలాగ్ చెప్పడం అంటే విశేషమే. వరుణ్ ను ఈ విషయంలో అభినందించాల్సిందే.

‘గన్ చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతావ్’ అంటూ వరుణ్ చెప్పిన వీడియో అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు కి అమెరికా లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అక్కడ అందరి ఇళ్ళల్లో అతడు డివీడి ఉంటుందంటే ఆ సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో అర్ధమౌతుంది.

Share

Leave a Comment