సూపర్‌స్టార్ ఫస్ట్ గెస్ట్

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణ మల్టిప్లెక్సుల కంటే ఒక మెట్టు ఎక్కువ గా రిచ్ ఇంటీరియర్స్ తో, లగ్జరీకి మారు పేరుగా ఈ మల్టి ప్లక్స్ పేరు తెచ్చుకుంది. సూపర్‌ స్టార్ రేంజ్‌కు తగ్గట్లే ఏఎంబీ సినిమాస్ ఉందని అందరి మాట.

కొత్త మల్టిప్లెక్స్ కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఎలాగూ ఉంటుంది. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో తొలి ఈవెంట్‌ నిర్వహించుకోబోతున్న సినిమా ‘అంతరిక్షం’.

హీరో వరుణ్ తేజ్, ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అంతరిక్షం 9000 kmph’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్.

ఈ లెక్కన ఫ్యూచర్ లో జరిగే సినిమా ఈ వెంట్లకు హైదరాబాద్ లో మరో కొత్త వేదిక దొరికినట్టే. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’ లో అదితి రావు హైదరీ, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్లు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఘాజి’ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్ర ట్రైలర్ ని అత్యాధునిక హంగులు, ఎఫెక్ట్స్ బావుండే థియేటర్ లో లాంచ్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఏఎంబి సినిమాస్ ను ఎంచుకున్నారు. సీటింగ్ సౌండ్ సిస్టమ్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది ఏఎంబీ సినిమాస్. డిసెంబర్ 21 న ఈ చిత్రం విడుదల కానుంది.

ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర యాడ్స్‌కి తోడు నిర్మాతగా కూడా రాణిస్తున్న మహేష్ తాజాగా సొంత మల్టీప్లెక్స్ ఓపెన్ చెయ్యడమనేది మరో విజయమే అంటున్నారు ఫ్యాన్స్. చాలా బిజీగా ఉన్నప్పటికి కొత్త రంగంలోకి అడుగు పెట్టాలనే తపనతో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ నిర్మాణం చేపట్టారు. సూపర్ స్టార్ కృష్ణ ఏఎంబీ సినిమాస్ ను ప్రారంభించారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ సినిమా “మహర్షి”తో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు 25వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Share

Leave a Comment