పోకిరి వల్లే డిసైడ్ అయ్యాను

తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. టాలీవుడ్ సహా ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఆయన. అంతే కాకుండా బాలీవుడ్, కాలీవుడ్ లో సైతం ఏకంగా అక్కడి చాలామంది హీరోయిన్స్ ఆయన అంటే అంటే మనసు పారేసుకుంటుంటారు. ఇంతకీ ఆయనెవరో స్పెషల్ గా చెప్పాలా? మన టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు..

మన టాలీవుడ్ నటుల్లో కూడా చాలా మంది సూపర్ స్టార్ కు వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక వారిలో మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్ అయిన టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు. విజయ్ దేవరకొండ ఫెవరెట్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని మనకు చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టికెట్స్ కోసం ఒకప్పుడు లైన్లో వెయిట్ చేసే వాడినని చాలా సందర్భాల్లో చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇక తాజాగా తాను సినిమాల్లోకి రావడానికి కారణం కూడా మహేష్
అని ఆయన చేసిన పోకిరి సినిమా వల్లే ఈ రోజు ఇలా ఉన్నానని కూడా చెప్పాడు విజయ్.

విజయ్ మాట్లాడుతూ.. మీ అందరికి తెలుసు నేను మహేష్ బాబు ఫ్యాన్ అని.. ‘పోకిరి’ సినిమా నా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని.. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ వల్ల నాకు 45 నిమిషాలు పాటు ఒక్క డైలాగ్ కూడా వినపడలేదని.. నేను అప్పుడే డిసైడ్ అయ్యా యాక్టర్ అవ్వాలని అని చెప్పాడు.

పోకిరి సినిమా మొదటి సారి చూసినప్పుడు హాలు లో విజిల్స్, ఫ్యాన్స్ హంగామ, చప్పట్లకి ఇది రా లైఫ్ అంటే ఇలా బ్రతకాలి అని అనుకునే వాడిని అని చెప్పాడు. నాకు ఇంకా గుర్తుంది పోకిరి సినిమా లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో జగడమే అని వస్తుంటే తనకి గూస్ బంప్స్ వచ్చేవి అని తెలిపాడు.

అటువంటి ఇష్టమైన హీరో తను ప్రొడ్యూసర్ గా చేసే మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా ఫంక్షన్ కి గెస్ట్ గా రావడం తనకి ఎంతగానో ఆనందంగా ఉందని చెప్పాడు. ఇప్పుడు లక్కీగా ఆ సినిమాను డైరెక్ట్ చేసిన పూరీ జగన్నాధ్ గారితో కూడా కలిసి పని చేస్తున్నా అని తెలిపాడు హీరో విజయ్ దేవరకొండ.

ఇలా విజయ్ తన సినిమా మీకు మాత్రమే చెప్తా ఫంక్షన్ పిక్స్ పోస్ట్ చేసాడో లేదో అప్పుడే ట్రెండ్ అయిపోతుంది. వేలాది రీట్వీట్ లు, షేర్ల తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. యూత్ ని ఎంతో అట్రాక్ట్ చేస్తున్న ఈ ట్రైలర్, సినిమాపై బాగా అంచనాలు పెంచింది.

ప్రస్తుత స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ. మహేష్ తరువాత ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ స్టార్‌గా మారాడు విజయ్‌ దేవరకొండ.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఎన్నో ప్రత్యేకలతో వస్తోన్న ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా, రేపు సంక్రాంతికి రిలీజ్ అయిన తరువాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. సారి మాస్ ప్రేక్షకులకు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఫుల్ మీల్స్ గ్యారంటీ అన్నమాట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దానికి మించిన స్పీడ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి.

Share

Leave a Comment