లైఫ్ అంటే అలా ఉండ్రాలా..

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ స్టైలే వేరు. స్వయంకృషితో ఎదిగిన హీరోగా ఇటీవల దేవరకొండ పాపులరయ్యారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం దేవరకొండ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. విజయ్ అనేక సందర్భాలలో మహేష్ మీద తనకున్న అభిమానాన్ని వివరించారు.

ఇది వరకు ఒక సందర్భంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నేను ఇంటర్ నుండి మహేష్ కి పెద్ద ఫ్యాన్ ని. అందుకే ఆయన్ని సార్ అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేం కాలేజ్ లో ఉన్నప్పుడు మా వాడు అని అనుకుంటుండే మేమందరం.

ఒక్కొక్క జర్నీకి ఒక్కొక్క సూపర్ స్టార్ ఉండేవాళ్లు. ఎప్పటికీ మహేష్ గారు ఆ స్థాయిలో ఉన్నారు అంటూ తాను మహేష్ కి ఎంత పెద్ద ఫ్యానో చెప్పేసారు విజయ్. తాను మహేష్ మూవీ కోసం టిక్కెట్ క్యూలో నిలబడి ఎన్ని తంటాలు పడేవాడో కూడా దేవరకొండ మహేష్ ఫ్యాన్స్ కి చెప్పారు.

మహేష్ సర్ ని చూసి లైఫ్ ఇలా ఉండాలని అనుకున్నానని దేవరకొండ చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. కోణార్క్ థియేటర్ లో మహేష్ సినిమాలు చూడాలనుకునేవాడిని. కానీ మాస్ లో ఉన్న ఆయన క్రేజ్ కారణంగా మొదటి రోజు టిక్కెట్స్ అసలు దొరికేవీ కావు.

చివరకు ఫస్ట్ డే అప్పుడు ఆడాళ్ల క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్ సమయంలో నా కజిన్స్ లో లేడీస్ ని, ఫ్రెండ్సుని పట్టుకుని టికెట్స్ తెప్పించుకునేవాడిని అని తెలిపారు. ఇలాంటి అడ్వెంచర్లు చాలా చేసి మహేష్ గారి సినిమాలు చూసే వారమని పాత విషయలు గుర్తుచేసుకున్నారు.

మహేష్ వెళ్లిన ఓ అవార్డ్ ఫంక్షన్ కి నటుడిగా వెళ్లినప్పుడు అక్కడకు మహేష్ గారు రాగానే ఆయన్ను అందరూ విష్ చేయడం చూసి అరె, లైఫ్ అంటే అలా ఉండ్రాలా అనుకున్నానని ఆ తర్వాత నేను పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు చేశానని దేవరకొండ తెలిపారు.

వాటిని చూసి మహేష్ గారు ట్వీట్ చేసేవారు. అప్పట్లో నా ఫోన్ లో ట్విట్టర్ వాట్సాప్ ఉండవు కానీ ఎవరో చెబితే వెళ్లి వెతుక్కునేవాడిని. నా గురించి ఆయన ఏదైనా గొప్పగా చెబితే సంతోషంగా అనిపించేది. ఆయన్ని గర్వంగా ఉంచడానికి వరుసగా సినిమాలు చేస్తాను.

నా గురించి ట్వీట్స్ చేసేలా చూసుకుంటాన అంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు దేవరకొండ. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ యంగ‌ర్ జ‌న‌రేష‌న్ హీరోల్లో విజ‌య్‌ను ఎక్కువ‌గా ఆడ్మైర్ చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాలో త‌న న‌ట‌న బాగా న‌చ్చింది అని చెప్పిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా మహేష్ బాబు హీరోగా త్వరలో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్, టాటూ హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Share

Leave a Comment