అప్పుడే చెప్పాను..

తెలుగు కమర్షియల్ సినిమాల్లో చరిత్ర సృష్టించిన హీరోయిన్ ఆవిడ. అత్యధిక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీసిన కథనాయక కూడా ఆమే. కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతోనూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు

బాక్సాఫీస్ హీరోలకు దీటైన స్టార్ డమ్ ను, ఇమేజ్ ని, క్రేజ్ ను సొంతం చేసుకొని హీరోయిన్ పాత్రల నేచర్ ను, స్టేచర్ ను, స్టేటస్ ను మార్చేసిన ఆ శిఖరాగ్ర స్ధాయి కథానాయిక విజయశాంతి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు

13 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు లో నటించి అందరి మన్ననలను అందుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఒక వెబ్‌సైట్/మ్యాగజీన్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మహేష్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేసారు

మహేష్ చిన్నప్పుడు నాతో కలిసి సినిమా చేసిన టైం లో నే తన టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోయాను. సూపర్ స్టార్ అవుతాడు అని నేను అప్పట్లోనే అనుకున్నాను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కూడా. అప్పట్లో క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ పెద్ద సెన్సేషన్

సచిన్ టెండూల్కర్ ఎంత సెన్సేషనల్ గా దూసుకు వచ్చాడో ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో మహేష్ బాబు అంతే సంచలనంగా దూసుకు వచ్చాడు. సచిన్ ఎంత గొప్ప బ్యాట్స్మన్ అయ్యాడో మహేష్ బాబు అంత పెద్ద హీరో అవుతాడని నేను అప్పుడే చెప్పాను

నేను అన్నది అనుకున్నది ఇప్పుడు నిజం అయింది. కృష్ణ గారి లాగానే మహేష్ బాబు కూడా చాలా కామ్. మహేష్ నన్ను అమ్మా అంటారు. లేదంటే మేడం అంటారు. నేను మహేష్ ని బాబు అంటాను. సెట్ లో ఉన్నప్పుడు ఎవరితో అయినా గౌరవంగా ఉండాలి

గౌరవం కాపాడాలి. హీరోల్ని గౌరవించాలి. సెట్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా మర్యాద తప్పనిసరి అని అన్నారు. మహేష్ చాలా సాఫ్ట్, హంబుల్ అని అన్నారు. హీరో అనగానే డిఫరెంట్ గా ఉంటారు అని అనుకున్నా. కానీ తను సెట్లో చాలా సరదాగా ఉంటారు.

ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో హీరోకు ప్యారలల్ గా సరిసమానమైన ఇలాంటి పాత్ర దొరకటం చాలా రేర్. నా రీ ఎంట్రీకి ఇది సరైన క్యారెక్టర్ అనే నమ్మకం తో ఒప్పుకుని చేసాను. ప్రస్తుతం యువ దర్శకులలు చాలా చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు

డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో సినిమాలు తీస్తున్నారు. గతంలో మన సినిమాలు ఒకటి రెండు జోనర్స్ కు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు మన దర్శకుల క్రియేటివ్ స్టాండర్డ్స్ బాగా పెరిగాయి. ఇది చాలా ఆనందించాల్సిన పరిణామం అని తెలిపారు

Share

Leave a Comment