మహేష్.. విజయశాంతిలు అలా కలుస్తారట

మహేష్ 26వ సినిమాగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ కాబట్టి దానికి అనుగుణంగానే ఎక్కడా గ్యాప్ రాకుండా పక్కా ప్లానింగ్ తో నిర్మాణం కొనసాగిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మొదటిసారి చేస్తున్న మూవీ కావడంతో ఆ రకంగానూ అంచనాలు అధికంగా ఉన్నాయి.

ఇకపోతే చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి గారి పాత్ర గురించి సస్పెన్సు ఇంకా కొనసాగుతోంది. ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

పదమూడు ఏళ్ళ తరువాత…విజయశాంతి గారికి మళ్ళీ ఇది మేకప్ వేసుకునే టైమ్. ఈ పదమూడు ఏళ్ళలో అసలు ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే యాటిట్యూడ్, అదే డైనమిసమ్. మా బృందంలోకి మీకు స్వాగతం విజయశాంతి గారు. సరిలేరు నీకెవ్వరు అని ట్వీట్ చేసారు అనిల్ రావిపూడి.

విజయశాంతి గారి రోల్ కు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. స‌రలేరు నీకెవ్వ‌రు చిత్రం కోసం విజ‌య‌శాంతి చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. విజ‌య‌శాంతి సుమారు 55 రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లోని నల్సార్ లా కాలేజీలో అమె సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఎక్కడో కాశ్మీర్ బోర్డర్ లో ఉండే మహేష్ కు ఈవిడకు లింక్ రివీల్ అయ్యాకే స్టొరీ ముందుకు వెళ్తుందని టాక్. ఈ క్రమంలో వచ్చే ఎపిసోడ్స్ అన్ని మహేష్ ఫ్యాన్స్ కి మాస్ మూవీ లవర్స్ కి పండగలా ఉంటాయని వినికిడి. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు విజయశాంతి గారితో చేసిన సినిమాలో ఆమె కొడుకుగా నటించారు.

మరి ఈ సినిమాలో వీరిద్దరి పాత్రకు ఎలాంటి సంబంధం ఉంటుందో అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మహేష్ తో మీ పాత్రకు రిలేషన్ ఏంటి అని విజయశాంతినే ప్రశ్నిస్తే ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. అయితే ఆ రెండు పాత్రలు ఒకదానితో ఒకటి పోటాపోటీగా ఉంటాయని సమాంతరంగా సాగుతాయని తెలిపారు.

సరిలేరు చిత్రంలో నాది చాలా పాజిటివ్ పాత్ర. అందరికీ నచ్చుతుందని వెల్లడించారు. తెలుగులో నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు (1980)లో హీరో కృష్ణగారు. నా లక్కీ హీరో ఆయన. ఇప్పుడు రీ ఎంట్రీ వాళ్లబ్బాయి మహేష్ బాబుతో! దీన్ని కూడా లక్కీగానే భావిస్తున్నా! మేం అనుకున్నట్టుగానే మహేష్ గొప్ప స్థాయికి చేరుకున్నాడు.

తనని చూస్తుంటే ఆనందంగా ఉంది అని అన్నారు. సరిలేరు నీకెవ్వరు కోసం ఇప్పటికే దాదాపు 6 కిలోలు తగ్గా. అందరూ కర్తవ్యంలో విజయశాంతిని చూసినట్టు ఉంది అని అంటున్నారు. ఇంకో నాలుగు కిలోలు తగ్గాలనుకుంటున్నా అన్నారు. ఇన్నాళ్ళకు మహేష్ తో పనిచేయడం కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నా అని విజయశాంతి తెలిపారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కాబోతున్నది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment