మహేష్ ఇంట బొజ్జ గణపయ్య..

​మునుపెన్నడూ చూడని కష్టకాలం ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి రానే వచ్చింది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడంతా తమ తమ ఇళ్లల్లోనే లంబోదరుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాల్సిన పరిస్థితి

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తగు జాగ్రత్తలతో పండుగ జరుపుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విటర్‌ వేదికగా గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు చెప్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ కూడా తన విషేస్ ను ట్విట్టర్ వేదిక గా తెలియజేసారు

మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాదో వినయపూర్వక అభ్యర్థన. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గుంపులుగా చేరకండి. దయచేసి పర్యావతరణ హిత గణేష్‌ ప్రతిమలను ప్రతిష్టించండి. అందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటూ మీ మహేష్ అని ట్వీట్ చేసాడు‌

మహేష్ బాబు సతీమని నమ్రత గారు మంచి హోమ్ మేకర్ అనే చెప్పాలి. తన కెరీర్ ని విడిచిపెట్టి భర్తనీ, పిల్లలు గౌతమ్, సితారలను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. పిల్లలకు మన సంప్రదాయాలను చెప్పి, పెంచుతున్నారు. అలాగే ఈ రోజు కూడా తమ ఇంట్లో వినాయక చవితి విశేషాలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రాం లో పోస్ట్ పెట్టారు

మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా గణపతి మరియు మా కుటుంబం మొత్తం మీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అని పోస్ట్ చేశారు నమ్రత. అలాగే పిల్లలు గౌతమ్, సితార వినాయకుడికి పూజలు చేస్తున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు

పిల్లలకు ఎంజాయ్ మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు గుడికి కూడా తీసుకెళుతుంటారు నమ్రత. సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబం కుల మతాలకు అతీతంగా ఇంట్లో అన్ని పండగలు జరుపుతుంటారు. గత ఏడాది కూడా వినాయక చవితి, దసరా, దీపావళి పండగలతో పాటు క్రిస్మస్ ను కూడా ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే

మరోపక్క మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన 65 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా మన టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తో పాటు గా పలువురు సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు

మహేష్ తన ట్విట్టర్ లో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీరు ఒక తరానికి ప్రేరణ కల్పించారు. అలాగే ఇప్పటికి కొనసాగుతారు. మీకు ఆరోగ్యం మరియు ఆనందం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను అంటూ తన విషేస్ తెలిపాడు

ఇది తాత్కాలికమే, ధైర్యంగా ఉండండి అంటూ చిరు మనందరికోసం ఒక మంచి సందేశాన్ని ఉంచారు. నిర్లక్ష్య ధోరణితో ఉంటూ కుటుంబాన్ని, జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టకండి. జాగ్రత్తగా ఉంటూ సురక్షితంగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్యమే అన్నిటికన్నా అతి ముఖ్యమైందని తెలిపారు

Share

Leave a Comment