మహేష్ ఇంట వినాయక చవితి సందడి

సూపర్‌స్టార్ మహేష్ బాబు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన అనుభూతులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఆ వినాయకుడు మీకు ఆనందాన్ని మరియు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు మహేష్ బాబు.

ఈ పోస్ట్ తో పాటు తన భరత్ అంట్ నేను స్టిల్ ను కూడా జత చేశారు సూపర్‌స్టార్. దీంతో ఈ పోస్ట్ కి అభిమాల నుంచి లైక్స్ , షేర్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. వెంటనే ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ట్రేండింగ్ మరియు ఫేసుబుక్ లో వేలాది లైక్ లు, షేర్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు సతీమని నమ్రత గారు మంచి హోమ్ మేకర్ అనే చెప్పాలి. తన కెరీర్ ని విడిచిపెట్టి భర్తనీ, పిల్లలు గౌతమ్, సితారలను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. పిల్లలకు మన సంప్రదాయాలను చెప్పి, పెంచుతున్నారు. అలాగే ఈ రోజు కూడా తమ ఇంట్లో వినాయక చవితి సందడి ఎలా ఉందో తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రాం లో ఒక పోస్ట్ పెట్టారు నమ్రత.

‘మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా గణపతి మరియు మా కుటుంబం మొత్తం మీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అని పోస్ట్ చేశారు’ నమ్రత. అలాగే తను మరియు తన పిల్లలు గౌతమ్, సితార వినాయకుడికి పూజలు చేస్తున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు నమ్రత. దీంతో ఈ పోస్ట్ కి అభిమాల నుంచి లైక్స్ , షేర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

పిల్లలకు ఎంజాయ్ మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు గుడికి కూడా తీసుకెళుతుంటారు నమ్రత. సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబం కుల మతాలకు అతీతంగా ఇంట్లో అన్ని పండగలు జరుపుతుంటారు. గత ఏడాది కూడా వినాయక చవితి, దసరా, దీపావళి పండగలతో పాటు క్రిస్మస్ ను కూడా ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. వినాయక చవితి నాడు కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేసారు. సో పండగ సెలవు లేనట్లే. నెలాఖరున మరో షెడ్యూల్‌ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్‌ 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Share

Leave a Comment