మహేష్ సినిమాలను ఎంజాయ్ చేస్తా

టీమిండియా జట్టులో వీవీఎస్ లక్ష్మణ్ పాత్రను ఏ క్రికెట్ అభిమాని కూడా మరువలేడు. క్రీజ్‌లో దిగారంటే అతన్ని అవుట్ చేయడం ప్రత్యర్థులకు చాలా కష్టంతో కూడుకున్న పని. అండగా నిలిచి జట్టు స్కోర్ పెంచడంలో లక్ష్మణ్ కీలకపాత్ర పోషించేవారు.

స్వతహాగా మితభాషి అయిన వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్లో మాత్రం కొంచెం యాక్టివ్ గానే ఉంటారు. ఈ రోజు ఆయన ఆస్క్ లక్ష్మణ్ హ్యాష్ టాగ్ తో తనతో ముచ్చటించమని నెటిజన్లను కోరారు. దాంతో పెద్ద ఎత్తున వీవీఎస్ లక్ష్మణ్ ను ప్రశ్నలు అడిగారు నెటిజన్లు.

ఆ ప్రశలలో కొన్నిటికి ఆశక్తికర సమాధానాలను ఇచ్చారు వీవీఎస్ లక్ష్మణ్. మీ ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరన్న ప్రశ్నకు లక్ష్మణ్ తనదైన శైలిలో బదులిచ్చారు. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారన్న వీవీఎస్ మహేష్ బాబు, నాని సినిమాలను చూడటాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పారు. బాలీవుడ్‌లో తన ఫేవరెట్ యాక్టర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని వీవీఎస్ చెప్పారు.

తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్నకు బదులిచ్చారు. జాతీయ స్థాయిలో ఆడగల ప్రతిభావంతులైన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. కానీ టోర్నీలు గెలిచినప్పుడే సరైన గుర్తింపు దక్కుతుందని వీవీఎస్ చెప్పారు. తాను శాకాహారినని చెప్పిన లక్ష్మణ్ తనకు బిర్యానీ అంటే ఇష్టమని, ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత ఇష్టమని తెలిపారు.

భారత జట్టు 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ నెగ్గుతుందనే ధీమాను లక్ష్మణ్ వ్యక్తం చేశారు. తానైతే లార్డ్స్ టెస్టులో జడేజా రూపంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకుంటానని, అతడు బ్యాటింగ్ కూడా చేయగలడని వీవీఎస్ చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న 43వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు మహేష్ అప్ కమింగ్ మూవీ `మహర్షి` టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ లను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో మహేష్ అభిమానులకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చినట్లయింది.

మహేష్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసంఖ్యాకంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను విష్ చేస్తూ ముంచెత్తారు. సూపర్ స్టార్ కు బర్త్‌డే విషెస్ చెపుతూ వాడిన టాగ్ ‘హెచ్‌బిడిసూపర్‌స్టార్‌మహేష్’ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ బర్త్‌డే ట్యాగ్ అయిపోయింది. 4.5 మిలియన్లకు పైగా ట్వీట్‌లతో సూపర్ స్టార్ అభిమానులు ట్విట్టర్ ను ముంచెత్తారు. దీంతో ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్యాగ్ అయిపోయింది.

Share

Leave a Comment