మరి కాసేపట్లో, లైవ్ చూడండి

అభిమానులకు సరికొత్త మహేష్ కనిపించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వెకేషన్ లో ఉన్న మ‌హేష్ బాబు తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు తన గెడ్డం లుక్ కెమెరా కంట పడి ఒక్కసారిగా వైరల్ అయ్యింది. తన 25వ సినిమా స్పెషల్ గా ఉండాలని సూపర్ స్టార్ లుక్ లో కొన్ని ప్రయోగాలు చేయనున్నారు అని తెలుస్తుంది.

ముంబయి విమానాశ్రయం లో గెడ్డం తో చూసిన దెగ్గర నుండి ఎప్పుడెప్పుడు మరలా ఆయన్ని చూద్దామా అని ఎదురుచుస్తున్నారు సూపర్‌స్టార్ అభిమానులు. ఇక వారందరికి శుభవార్త. నేడు సూపర్‌స్టార్ తన కొత్త లుక్ తో స్టేజ్ మీదకి రాబొతున్నారు.

సుధీర్ బాబు, అదితిరావు జంటగా నటించిన మూవీ సమ్మోహనం. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన ఈ మూవీ ఈ నెల 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడ‌క‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌లో ముఖ్య అతిథిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాల్గొననున్నారు. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని లైవ్‌లో చూడాలనుకొనేవారు ఈ క్రింది లింక్ లో చూడండి.

ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలకానున్నది. ఈ కార్యక్రమంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, చిత్రంలో నటించిన ప్రధాన తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ అన్నింటికి పాజిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మహేష్ రాక తో సినిమాకు మరింత బజ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుక‌లో సూప‌ర్ స్టార్ న్యూ లుక్‌ ని చూడొచ్చని అభిమానులు అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. జూన్‌ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను పొందింది.

మహేష్ తన 25వ సినిమా కోసం ఛేంజోవర్ కోసం ట్రై చేస్తున్నారు. కొత్త షెడ్యూల్ డెహ్రాడూన్‌లో జూన్‌ 17న స్టార్ట్‌ కానుందట. డెహ్రాడూన్‌ అవుట్‌స్కర్ట్స్‌లో ఓ మూడు రోజులు షూటింగ్‌ జరిపి, 21 నుంచి డైరెక్ట్‌గా కాలేజ్‌కి షిఫ్ట్‌ అవుతారట చిత్రబృందం.

Share

Leave a Comment