మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు

టాలీవుడ్ హీరో మహేష్ బాబు మరోసారి తన సహృదయాన్ని చాటుకొని సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో నెల రోజుల శిశువుకు అరుదైన గుండె శస్త్రచికిత్సను ఉచితంగా చేయించి రియల్ హీరో అనిపించుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా ఆళ్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి ప్రదీప్ దంపతుల శిశువుకు అరుదైన గుండె జబ్బు ఉంది. ఆక్సిజన్తో కూడిన మంచి రక్తం గుండెలోని చెడు రక్తంతో కలిసి పోతోంది. బిడ్డ తల్లితండ్రులు బీదవారు. వారికి ఆపరేషన్ చేయించే స్దోమత లేదు.

దాంతో ఓ వ్యక్తి ద్వారా ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు పాపకు వైద్య చికిత్సలు చేయాలని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులను కోరాడట. పాపను ఆసుపత్రికి తీసుకురాగానే ఈ నెల 2న ఉచితంగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది.

ఆ తర్వాత పాప రక్తపోటు తగ్గటం.. గుండె కొట్టుకోవడంలో మార్పుతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చాయి. ఈ సమస్యలన్నింటినీ దాటుకొని రెండు వారాల తర్వాత ఇంటెన్సివ్ కేర్ నుంచి శిశువు బయటకు వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్ఛార్జి చేశారు.

అలా సూపర్ స్టార్ మళ్లీ తన సేవాదృక్పథాన్ని చాటుకున్నాడు. తమ బిడ్డను కాపాడిన మహేష్ బాబు సాయాన్ని ఎన్నటికీ మరిచిపోమని నాగజ్యోతి పేర్కొంది. మహేష్ బాబు రియల్ హీరో అని తండ్రి ప్రదీప్ కీర్తించారు. మరోసారి మహేష్ తన ఉదారత ను పిల్లల పైన తనకుండే ప్రేమను ఇలా చాటుకున్నారు.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. సామాన్య ప్రజలే కాదు ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు.

ఇదిలా ఉండగా మహేష్ బాబు హీరోగా త్వరలో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్, టాటూ హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట.

మహేష్ అభిమానులు కోరుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ పరశురామ్ రెడీ చేసాడని టాక్. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది అని తెలిపాడు పరశురామ్‌. ఇక ఈ సినిమా పై సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులలో భారీ అంచనాలే ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

Share

Leave a Comment