మా ఫ్యామిలీ ఫేవరెట్

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా చక్కని క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. చిన్న సాంకేతిక నిపుణుడి నుంచి మొదలుకుని పెద్ద నటుడి వరకు అందరూ మనస్ఫూర్తిగా పని చేస్తుంటారని తెలిపింది. తమిళ, తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రిమేక్ అవుతున్న విషయాన్ని గుర్తుచేసారు.

గోపీచంద్ చాణక్య సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న జరీన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తెలుగు సినిమాల గురించి మరియు మహేష్ బాబు గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు జరీన్ ఖాన్.

ఆమె ఏమన్నారంటే.. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఇక్కడ అంత మంచి సినిమాలు తీస్తారు కాబట్టే బాలీవుడ్ లో కూడా వీటినే రీమేక్ చేస్తున్నారు. మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో. ఆయన నటించిన సినిమాలు చాలా చూసాను. ముంబాయిలో మాకు ఒక ఛానల్ ఉంటుంది.

తమిళ, తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి టెలీకాస్ట్ చేస్తుంటారు. అలా మహేష్ బాబు సినిమాలు అన్నీ చూసాను. మా ఫ్యామిలీ కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్. ఏదో ఒక రోజు ఆయనతో నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అంత పెద్ద స్టార్ పక్కన అవకాశం అంటే ఎలా వదులుకుంటాను. అలా నటిస్తే చాలా నేర్చుకుంటాను.

తాను రూమర్స్ పట్టించుకోనని విని నవ్వుకుంటానని చెప్పారు. ప్రస్తుత కాలంలో పెళ్లి పెద్ద జోక్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ఇది చాలా బాధకరమని పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అని తన అభిప్రాయాన్ని తెలిపారు. టెస్ట్ డ్రైవ్ చేసి కారు ఇంటికి తెచ్చుకోవడం లాంటిదే ఈ సహజీవనమని తెలిపారు. పెళ్లి చేసుకుని ఆ తర్వాత బాధపడే కన్నా ముందే ఒకరికొకరు తెలుసుకుంటే మంచిద కదా.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూట్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాశ్మీర్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూట్ జరుగుతోంది.

అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎవరనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారని అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆయన రత్నవేలుతో పని చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రత్నవేలు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి పని చేశారు.

ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది కాబట్టి పూర్తిగా సరిలేరు సినిమా మీదే ఆయన ఫోకస్ చేయనున్నారు. మహేష్ తో 1 నేనొక్కడినే, బ్రహ్మోత్సవం చిత్రాలకు రత్నవేలు ఇప్పటికే ఛాయాగ్రహణం అందించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకి పని చేస్తున్నారన్నది ఆ టీమ్ కి శుభవార్తనే.

ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీ, యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయట. చాన్నాళ్ళ తరువాత విజయశాంతి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక.

తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ సంగతి ఏంటో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment