ఫ్యామిలీ ఫేవరెట్

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా చక్కని క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. చిన్న సాంకేతిక నిపుణుడి నుంచి మొదలుకుని పెద్ద నటుడి వరకు అందరూ మనస్ఫూర్తిగా పని చేస్తుంటారని తెలిపింది. తమిళ, తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రిమేక్ అవుతున్న విషయాన్ని గుర్తుచేసారు.

జరీన్ హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తెలుగు సినిమాల గురించి మరియు మహేష్ బాబు గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు జరీన్ ఖాన్. ఆమె ఏమన్నారంటే..

హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఇక్కడ అంత మంచి సినిమాలు తీస్తారు కాబట్టే బాలీవుడ్ లో కూడా వీటినే రీమేక్ చేస్తున్నారు. మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో. ఆయన నటించిన సినిమాలు చాలా చూసాను. ముంబాయిలో మాకు ఒక ఛానల్ ఉంటుంది.

తమిళ, తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి టెలీకాస్ట్ చేస్తుంటారు. అలా మహేష్ బాబు సినిమాలు అన్నీ చూసాను. మా ఫ్యామిలీ కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్. ఏదో ఒక రోజు ఆయనతో నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అంత పెద్ద స్టార్ పక్కన అవకాశం అంటే ఎలా వదులుకుంటాను. అలా నటిస్తే చాలా నేర్చుకుంటాను.

తాను రూమర్స్ పట్టించుకోనని విని నవ్వుకుంటానని చెప్పారు. ప్రస్తుత కాలంలో పెళ్లి పెద్ద జోక్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ఇది చాలా బాధకరమని తన అభిప్రాయాన్ని తెలిపారు. పెళ్లి చేసుకుని ఆ తర్వాత బాధపడే కన్నా ముందే ఒకరికొకరు తెలుసుకుంటే మంచిద కదా అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మాస్ క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల్లో అభిమానులున్న నటుడు. వరుస విజయాలతో మహేష్ బాబు ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు. ఈ సూపర్‌స్టార్ హీరో 2019 సంవత్సరానికి గాను అబ్బురపరిచే ఫీట్ సాధించాడు. మరోసారి నేషనల్ లెవెల్ లో తన సత్తా ఎంటో చూపించాడు.

తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక్కడినే.. అది కూడా నేనే అంటూ ఆయన అభిమానుల్లో జోష్ నింపాడు. 2019 సంవత్సరానికి గాను భారత దేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టును ప్రకటించింది ట్విట్టర్. ఈ లిస్టులో తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే స్థానం దక్కించుకున్నాడు.

వరుసగా మూడు బ్లాక్ బస్టర్ మూవీస్, ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసర్స్ ఆఫ్ తెలుగు సినిమా లో 3 మూవీస్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు. బాక్ టు బాక్ వంద కోట్ల షేర్ సినిమాలతో మన సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.

టాలీవుడ్ చరిత్రలో ఇలా బాక్ టు బాక్ మూడు సార్లు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఏకైక హీరోగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సంచలన రికార్డ్ కొట్టాడు. నాన్ బాహుబలి రికార్డులను తన పేరిట లిఖించుకుంటూ సరికొత్త చరిత్ర లిఖించాడు సూపర్‌స్టార్.

Share

Leave a Comment